సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. తిరుమలలో తొమ్మిది మంది భక్తుల ప్రాణాలు తీసిన విఫల ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని.. ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు గడ్డి పెట్టినా ఈ నీచులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు (గురువారం) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పేర్నినాని మాట్లాడుతూ.. " స్థానిక సంస్థల ఎన్నికలు గొప్పగా నిర్వహిస్తామని సర్కార్ గొప్పలు చెప్పింది. నిర్వహించే సత్తా లేనప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం ఎందుకు? ఎన్నికల సంఘం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మేయరో, మున్సిపల్ ఛైర్మన్ ఎవరో మీరే ఎంపిక చేసుకొండి. ఎన్నికలు నిర్వహించడం ఎందుకు. నిర్వహణకు ఖర్చు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత దారుణంగా జరుగుతున్నాయో తెలపడానికి పుంగనూరు ఘటనే ఉదాహరణగా నిలిచిందన్న ఆయన పుంగనూరులో నామినేషన్లు వేయనియని పరిస్థితి ఏర్పడిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. మీ దిక్కుమాలిన ప్రభుత్వం ఎవరికి ఆదర్శమని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 76 చోట్ల దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు
అసలు నామినేషన్ సెంటర్లలో టీడీపీ ఎమ్మెల్యేలలకు ఏం పనని? మరో రెండు రోజులు నామినేషన్లకు అవకాశాలు కల్పించాలని సుప్రీం చెప్పిందన్నారు. సుప్రీం కోర్టు గడ్డి పెట్టినా ఈ నీచులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో నామినేషన్ వేసేందుకు వెళ్తే ఓ అధికారి ఇంటికి వెళ్లాలన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ నామినేషన్ వేయనివ్వలేదని పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి


