కృష్ణంరాజు మృతి.. పలువురు ఏపీ ప్రముఖల సంతాపం

Rebel Star Krishnam Raju Passes Away, YSRCP Leaders Condolences - Sakshi

ప్రముఖ నటుడు రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

కృష్ణంరాజు గారి మరణం వెండతెరకు తీరని లోటు: మల్లాది విష్ణు
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు గారి మృతి బాధాకరమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. తన అద్భుత నటనతో, భిన్నమైన పాత్రలతో తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన నటుడాయన.

ఐదున్నర దశాబ్దాల కాలంలో 180కి పైగా చిత్రాలలో నటించి.. ఎన్నో కీర్తి కిరీటాలు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. అధికంగా కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. సినీ రంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా నిలిచారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

మంచితనానికి మారుపేరు: మంత్రి  జోగి.రమేష్ 
మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పార్లమెంటు సభ్యుడుగా కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు గారు నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి.ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

కృష్ణంరాజు  మృతి బాధాకరం: మాజీ మంత్రి వెలంపల్లి
ప్రముఖ సినీ నటులు రెబ‌ల్ స్టార్‌ మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు  మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. కృష్ణంరాజు న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అన్నారు. తన అద్భుత నటనతో, భిన్నమైన పాత్రలతో తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన వ్యక్తి కృష్ణంరాజు అన్నారు.

ఐదున్నర దశాబ్దాల కాలంలో 180కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో కీర్తి కిరీటాలు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారన్నారు. సినీరంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా చెప్పుకోవచ్చురు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఆయన  పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు.ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అ ప్రకటనలో పేర్కొన్నారు.

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోను రెబల్ స్టార్‌గా వెలిగిన కృష్ణంరాజు మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

పశ్చిమగోదావరి జిల్లా: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు ఆయన చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి నర్సాపురం, మొగల్తూరు ప్రజలకు తీరని లోటు. మొగల్తూరు ఖ్యాతి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి కృష్ణంరాజు అని ప్రసాదరాజు కొనియాడారు. 

► కృష్ణంరాజు మృతిపట్ల రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ పాతపాటి సర్రాజు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
► కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భీమవరం ఎమ్మెల్యే  గ్రంధి శ్రీనివాస్

విజయవాడ: హీరో, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతికి మాజీ మంత్రి శ్రీరంగనాథ రాజు సంతాపం తెలిపారు. కృష్ణం రాజు తెలుగు నటుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top