అప్పుడు అన్ని వేళ్లు బాబు వైపు చూపించలేదా?: రాచమల్లు | Rachamallu Sivaprasad Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అప్పుడు అన్ని వేళ్లు బాబు వైపు చూపించలేదా?: రాచమల్లు

Sep 30 2026 4:37 PM | Updated on Sep 30 2026 5:56 PM

Rachamallu Sivaprasad Reddy Slams Chandrababu Naidu

ప్రొద్దుటూరు: చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం రాచమల్లు ప్రొద్దుటూరులో మీడియాతో మాట‍్లాడారు. వంగవీటి మోహన్‌ రంగాను చంపింది ఎవరు? అన్ని వేళ్లు బాబు వైపు చూపించలేదా? అని అన్నారు.

‘‘దస్తగిరి మాటలు ఎల్లో మీడియాలో బ్యానర్‌ ఐటమ్‌లు. మల్లెల బాబ్జీని చంపించింది ఎవరు? పింగళి దశరథరామ్‌ను చంపించింది ఎవరు? శవాల మీద రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేసేది బాబే. పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడంలో చంద్రబాబు దిట్ట. 

దస్తగిరి, సునీల్‌ యాదవ్‌తో చౌకబారు మాటలు మాట్లాడిస్తున్నది సునీత కాదా? వివేక హత్య అంతి లాభం చంద్రబాబు, టీడీపీకే వివేక హత్య విషయంలో చంద్రబాబుకు ఎంత లాభపడాలో సునీత అంత లాభపడుతున్నారు’’ అని తెలిపారు. దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ మీద సునీతకు ఎందుకు ఇంత ప్రేమ అని ప్రశ్‌నించారు. తండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడాలన్న కోరిక సునీత ఉందా? అని అన్నారు.

ఇదీ సంగతి: ఇండి కూటమి భేటీలో దేశ వ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం

అప్పులు పంచుతున్నాడు
సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలకు చంద్రబాబు అప్పులు పంచుతున్నాడని రాచమల్లు అన్నారు. ‘‘డీఎస్సీలో ఉద్యోగాలను అమ్ముకుంటున్నాడు. సూపర్‌ సిక్స్‌ సంక్షేమాన్ని ఇళ్లకే పంపుతానని సూపర్‌గా మోసం చేస్తున్నాడు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి..ఇప్పుడు వాళ్లందర్నీ రోడ్డుకీడ్చాడు. రైతులకు తేనెపూసిన మాటలు చెప్పాడు...ఇప్పుడు రైతులు కరువు కోరల్లో చిక్కి శల్యమవుతున్నాడు.

వీటన్నిటినీ డైవర్ట్‌ చేయడానికి ఏదో ఒక అబద్ధాన్ని తెరమీదకు తెస్తాడ. వాటిలో టీవీ సీరియల్స్‌లా అంతులేని కథలా వివేకా హత్య, లిక్కర్‌ కేసులు ఆయన తెరమీదకు తెస్తాడు. ఈ రెండు కేసులకు చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తం అయ్యే వరకూ ముగింపు ఉండదు. వివేకా హత్య కేసులో నిత్యం బురదజల్లండి అని కొడుకుకు కూడా వారసత్వం ఇస్తున్నాడు. 

సుప్రీం కోర్టు, సీబీఐ కోర్టు, దర్యాప్తు సంస్థ అందరూ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని చెప్పాయి. కొత్తగా ఎవర్నీ విచారించాల్సిన అవసరం లేదని ఆ సంస్థలు తేల్చి చెప్పినా పచ్చ మీడియా వండి వారుస్తూనే ఉన్నారు. ఆ పత్రికలు మళ్లీ బ్యానర్‌ ఐటమ్‌ రాస్తున్నారు...అసలు బ్యానర్‌ ఐటమ్‌ రాయడానికి ఒక ప్రజా జీవితానికి అవసరమైనదై ఉండాలి. కానీ వీళ్లు మాత్రం వివేకా కేసు, లిక్కర్‌ కేసు అంటూ అబద్ధాలపై మేడలు కడుతూనే ఉన్నారు. 

ఎవరైతే వివేకాను గొడ్డలితో పైశాచికంగా హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ల మాటలను బ్యానర్‌ చేస్తున్నారు. హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని పొత్తుల గురించి మాట్లాడటం కాదా శవాలపై రాజకీయం? బాలకృష్ణ ఇంట్లో తుపాకులతో కాల్పులు జరపడం కాదా గన్‌ కల్చర్‌...? సాక్ష్యంగా ఉన్న వాచ్‌మన్‌ను మరుసటి రోజే బండతో దాడి చేసి చంపారు. ఎన్టీఆర్‌పై దాడి చేసిన మల్లెల బాబ్జీ ఓ లాడ్జీలో ఎలా చనిపోయాడు..? పింగళి దశరథరామ్‌ను వేటకొడవళ్లతో నరికి చంపింది మీరు కాదా..? 

ఈ కేసులన్నీ నారా చంద్రబాబునాయుడి వైపే వేల్లెత్తి చూపించాయి. చంద్రబాబుకు అవసరమైన ప్రతి సారీ వివేకానందరెడ్డి హత్య అవుతూనే ఉన్నాడు. అంతిమ లాభం ఏంటో మంత్రి సత్యప్రసాద్‌ సమాధానం చెప్పాలి. సునీతకు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు వీళ్లు అంతగా ఉపయోగపడ్డారు కాబట్టే వారికి ఈ పదవులు ఇస్తున్నారు’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement