కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో, 1న సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఏపీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము
సాక్షి, విశాఖపట్నం/అనంతపురం/న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళ, బుధవారాల్లో ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా ప్రత్యేక విమానంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ చేరుకోనున్న రాష్ట్రపతి, మధ్యాహ్నం 3.10 గంటలకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం వాయుమార్గంలో సాయంత్రం 5 గంటలకు బెంగళూరు బయలుదేరి వెళతారు.
జూలై 1న ఉదయం 9.30 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి అనంతపురం శివారులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. అనంతరం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళతారు.


