మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్‌.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి నారాయణ ఉమనైజర్‌.. పొంగూరు ప్రియ సంచలన వ్యాఖ్యలు

Published Wed, Jan 24 2024 4:41 PM

Ponguru Priya Sensational Comments On Former Minister Narayana - Sakshi

సాక్షి, అమరావతి: నారాయణ ఒక ఉమనైజర్.. అతడిని ఎవరు నమ్మొద్దంటూ మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు పొంగూరు ప్రియ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. నేను చాలా ఆవేదనతో ఈ వీడియో పెడుతున్నాననంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు.

సొంత కుటుంబ సభ్యులనే వేధిస్తున్న మాజీ మంత్రి నారాయణను నెల్లూరు ప్రజలు నమ్మి దయచేసి మోసపోవద్దు. ఇంట్లో ఆడవాళ్లని వేధిస్తూ టార్చర్‌కు గురిచేసే నారాయణ ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రియ ప్రశ్నించారు.

పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడని.. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నానని.. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్‌రూమ్‌లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడని గతంలో కూడా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి: ‘గ్లాసు’కు రేటు కట్టిన మాజీ మంత్రి నారాయణ

Advertisement
 
Advertisement