పల్లెకు బైబై.. పట్నం దారిలో కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు | Sakshi
Sakshi News home page

పల్లెకు బైబై.. పట్నం దారిలో కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు

Published Thu, Jan 18 2024 6:06 PM

People Returning To Hyderabad As Sankranthi Holidays Over  - Sakshi

సాక్షి, విజయవాడ: సంక్రాంతి సెలవులు ముగియడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి భారీ సంఖ్యలో ఏపీకి తరలి వెళ్లిన వారంతా రిటర్న్‌ అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ రహదారిపై హైదరాబాద్‌ వైపు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.

వేలాది వాహనాల్లో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు. చౌటుప్పల్‌ వద్ద పంతంగి టోల్‌ ప్లాజా, కేతేపల్లి వద్ద కొర్లపాడ్‌ టోల్‌ ప్లాజాల వద్ద రద్దీకి అనుగుణంగా బూత్‌ల సంఖ్యను పెంచారు.

మరోపక్క ఏపీలో బస్‌  స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు బస్సులకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఇక ట్రావెల్స్‌ బస్సులైతే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. 

ఇదీచదవండి.. అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్‌ ఆంక్షలివే

Advertisement
 
Advertisement