returning
-
‘చార్ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు?
చార్ధామ్ యాత్ర సాఫీగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ఫలించడం లేదు. దీంతో చాలా మంది భక్తులు యాత్ర చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు రిషికేశ్ నుండి తిరుగుబాట పట్టారని సమాచారం. ఉత్తరాఖండ్‌కు చేరుకున్న తరువాత కూడా చార్ధామ్ యాత్ర చేయలేకపోవడం విచారకరమని వారు వాపోతున్నారు. యాత్రకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయడంతోనే ఈ సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆపివేసిన నేపధ్యంలో సుమారు 12 వేల మంది యాత్రికులకు ధామ్‌లను సందర్శించడానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు స్థానిక పరిపాలన యంత్రాంగం ప్రకటించింది. అయితే అది పూర్తి స్థాయిలో కార్యారూపం దాల్చలేదు. దీంతో పలువురు యాత్రికులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.ట్రాన్సిట్ క్యాంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఆరు వేల మంది యాత్రికులకు మాత్రమే తాత్కాలిక రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో మిగిలిన ఆరు వేల మందిలో దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు చార్ధామ్ దర్శనం కాకుండానే వెనుదిరిగారు. దాదాపు రెండున్నర వేల మంది యాత్రికులు ఇప్పటికీ ట్రాన్సిట్ క్యాంపు ప్రాంగణం, ధర్మశాలలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వేచిచూస్తున్నారు.ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను మే 31తో నిలిపివేయాలని పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది. అయితే ట్రాన్సిట్ క్యాంపులో ఉన్న యాత్రికులలో సుమారు 800 మంది ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. కాగా ఈ యాత్రికులకు వసతి, భోజన ఏర్పాట్లను స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. -
పల్లెకు బైబై.. పట్నం దారిలో కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి సెలవులు ముగియడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఏపీకి తరలి వెళ్లిన వారంతా రిటర్న్ అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వేలాది వాహనాల్లో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు. చౌటుప్పల్ వద్ద పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి వద్ద కొర్లపాడ్ టోల్ ప్లాజాల వద్ద రద్దీకి అనుగుణంగా బూత్‌ల సంఖ్యను పెంచారు. మరోపక్క ఏపీలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ట్రావెల్స్ బస్సులైతే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇదీచదవండి.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలివే -
ఆర్వోల నిర్ణయమే అంతిమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల పరి శీలనలో రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లు తీసుకున్న నిర్ణయాలే అంతిమమని, వాటిపై పునః సమీక్ష జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం లేదని రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి (డిప్యూటీ సీఈఓ) సత్యవాణి స్పష్టం చేశారు. కొందరు అభ్యర్థుల విషయంలో ఆర్వోల నిర్ణయాలపై వచ్చిన ఫిర్యాదులను తిరిగి వారికే పంపించినట్టు తెలిపారు. ఆర్వోలకు క్వాజీ జ్యుడీషియల్ అధికారాలుంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను వివరించేందుకు శుక్రవారం ఆమె బీఆర్కేఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 18లోగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 20 లోగా ఈవీఎంల బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేస్తామన్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 299 అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతినిచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కి పెరిగిందని చెప్పారు. ప్రతి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దే ఈవీఎంలను నిల్వ చేసే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయని తెలిపారు. పోలింగ్‌లో వినియోగించిన ఈవీఎంలను కేటగిరీ–ఏ, పోలింగ్ సందర్భంగా మొరాయించిన ఈవీఎంలను కేటగిరీ–బీ కింద పరిగణించి ఒకే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తామన్నారు. మాక్‌పోల్‌కి వాడిన ఈవీఎంలను కేటగిరీ–సీ, రిజర్వ్ ఈవీఎంలను కేటగిరీ–డీ కింద పరిగణించి వేర్వేరు స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరుస్తామని వివరించారు. 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించే తేదీలను స్థానిక రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని సత్యవాణి తెలిపారు. మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను నిర్వహిస్తారన్నారు. పోలింగ్ నవంబర్ 30న జరగనుండగా, దానికి 3 రోజుల ముందులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పాస్‌లు రావడంలో జాప్యం కావడంతో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను జిల్లాల కలెక్టర్లు తిరస్కరించిన అంశంపై పరిశీలన చేస్తామన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ 28,057
సాక్షి, హైదరాబాద్: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మందికి పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వచ్ఛిన ‘ఫారం–12డీ’దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు అనుమతించిన పోస్ట ల్ బ్యాలెట్ వివరాలను గురువారం ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం మొత్తం 44,097 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అధికారులు 28,057 మంది అర్హులను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం పరిధిలో 707 దరఖాస్తులు రాగా, వాటన్నిటికీ రిటర్నింగ్ అధికారులు అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో 706 దరఖాస్తులు రాగా వాటికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 812 దరఖాస్తులకు గాను 757 పోస్టల్ బ్యాలెట్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన 610 దరఖాస్తుల్లో 339 మాత్రమే అంగీకరించారు. అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గ పరిధిలో 19 దరఖాస్తులురాగా, రిటర్నింగ్ అధికారులు అంగీకరించారు. నారాయణపేట్ నియోజకవర్గ పరిధి లో 28 దరఖాస్తులు రాగా, 28 దరఖాస్తులను, వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో 30 దరఖాస్తులకుగాను 26 పోస్ట ల్ బ్యాలెట్లను అనుమతించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 31 దరఖాస్తులకుగాను 31 పోస్టల్ బ్యాలెట్లు, కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో 34 దరఖాస్తు లు రాగా, వాటన్నిటినీ రిటర్నింగ్ అధికారులు అంగీకరించారు. ఎన్నికల విధులతో సంబంధం లేని 13 రకాల అత్యవసర సేవల్లో నిమగ్నమై ఉండే ఓటర్లకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించాలన్న సీఈసీ ఆదేశాల మేరకు వారికీ ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఇచ్ఛినట్టు తెలిసింది. -
ప్రవాసులు దిగొస్తున్నారు!
ఎన్ఆర్ఐలు ఇండియాకి తిరిగొస్తున్నారు. భౌతికంగా కాదు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు రూపంలో! బినామీ లావాదేవీల చట్టం, రెరా,జీఎస్టీలతో స్థిరాస్తి రంగంలోపారదర్శకత, లావాదేవీల్లో జవాబుదారీతనం పెరిగింది. వీటికి తోడు 100 శాతం ఎఫ్‌డీఐ, రీట్స్ పెట్టుబడులకుపచ్చజెండా ఊపడంతో ప్రపంచ దేశాల్లోని ప్రవాసుల్లో జోష్ నెలకొంది. దీంతో భారత స్థిరాస్తి రంగంలో ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్మెంట్స్ క్రమంగా పెరుగుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం.. ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) 2018లో 79 బిలియన్ డాలర్ల చెల్లింపులు నిర్వహించారు. ఇందులో సింహభాగం లావాదేవీలు రియల్ ఎస్టేట్ రంగంలోనే జరిగాయి. యూఏఈ, అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు చెందిన ఎన్ఆర్ఐలు దేశీయ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఏటా ఎన్ఆర్ఐల పెట్టుబడులు 2–3 శాతం వరకు పెరుగుతున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్స్ మిడిల్ ఈస్ట్ సీఈఓ షాజాయ్ జాకబ్ తెలిపారు. ఆర్ధిక సంస్కరణలు, స్థిరాస్తి రంగంలో పారదర్శకత, స్థిరమైన ప్రభుత్వ పాలన, విధానాలు వంటి కారణాలతో విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. నిర్మాణ అభివృద్ధి పనుల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు, కమర్షియల్ ప్రాపర్టీల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రీట్స్) పెట్టుబడులకు అవకాశం కల్పించడం వంటివి ఎన్ఆర్ఐ పెట్టుబడుల వృద్ధికి కారణాలుగా చెప్పవచ్చు. యూఏఈ నుంచే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండియన్ జనాభా 33 లక్షలు. భారతదేశం వెలుపల అధికంగా ఇండియన్స్ ఉన్న దేశం యూఏఈనే. దుబాయ్‌లోని ఎన్ఆర్ఐలు అధికంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతుంటారు. దిర్హంతో పోలిస్తే ఇండియన్ రూపాయి విలువ తక్కువగా ఉండటంతో ఇక్కడ పెట్టుబడులకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. 2018లో ప్రపంచ దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఇండియాకు పంపించిన సొమ్ములో 26.9 శాతం యూఏఈ వాటా ఉందని ఆర్బీఐ తెలిపింది. పెట్టుబడులకు నివాసాలే కరెక్ట్.. గతంలో ఎన్ఆర్ఐలు హై ఎండ్ లగ్జరీ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెడుతుండేవారు. వాటిని అద్దెకు ఇచ్చి నివాసితులకు అంతర్జాతీయ వసతులు, జీవనశైలిని కల్పించేవారు. ఇన్వెస్టర్లకు అద్దెల్లో వృద్ధి కూడా కనిపించేది. అయితే ప్రస్తుతం ఎన్ఆర్ఐలు అందుబాటు గృహాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు అఫడబుల్ హౌజింగ్‌లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దీంతో అందుబాటు గృహాలకు డిమాండ్ పెరిగింది. పైగా దీర్ఘకాలిక అద్దెలతో పాటూ ఆదాయంలో పన్ను రాయితీలు కూడా ఉంటాయి. రెరాలో నమోదైతేనే.. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు ప్రత్యేక రాయితీలు, డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. వీటితో ప్రాజెక్ట్ నిర్మాణ స్థితిగతులను ఎప్పటికప్పుడు అందజేసేందుకు ఆగ్యుమేటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆర్గనైజ్ డెవలపర్లు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదైన ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులకే ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపిస్తున్నారు. సొంత రాష్ట్రం, నగరంలోనే పెట్టుబడులకు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే తెలిసిన ప్రాంతం కావటం, అద్దె వసూళ్లు, ప్రాపర్టీల నిర్వహణ, పర్యవేక్షణ వంటివి సులువవుతాయని వారి అభిప్రాయం. ఈ నగరాల్లో ఎందుకంటే? ఎన్ఆర్ఐల పెట్టుబడులు ఆకర్షించే ప్రధాన నగరం ఢిల్లీ–ఎన్సీఆర్. ఆ తర్వాత బెంగళూరు, ముంబై, పుణే, హైదరాబాద్, చెన్నై నగరాలుంటాయి. కారణమేంటంటే? ►ఆయా నగరాల్లో ఆర్థికాభివృద్ధి కారణంగా నూతన ఉద్యోగ అవకాశాలు. ►సులువైన వ్యాపార విధానాలు ► మెరుగైన మౌలిక సదుపాయాలు, జీవనశైలి ►మెరుగైన రవాణా సదుపాయాలు. ఇంట్రా సిటీ రోడ్లతో పాటూ జాతీయ రహదారుల నిర్మాణం, విమాన సేవలతో అనుసంధానం. -
ఇది భారత్‌కు ప్రమాదకరం: నిఘావర్గాలు
న్యూఢిల్లీ: ఇరాక్, సిరియాలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఇటీవలి కాలంలో సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి సిరియా, ఇరాక్‌లకు వెళ్లి అక్కడ ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారు.. తిరిగి స్వదేశాలకు పయనమయ్యే అవకాశాలు పెరిగాయని తెలుస్తోంది. భారత్ నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారి సంఖ్య 40 నుంచి 50 మంది వరకు ఉంటుందని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయి. సంకీర్ణ సేనల దాడులతో ఇస్లామిక్ స్టేట్ తమ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలను క్రమంగా కోల్పోతున్న నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లిన యువత తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి వెల్లడించారు. యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించి.. ఇస్లామిక్ స్టేట్‌తో పూర్తిగా ప్రభావితమై ఉన్న వీరు.. దేశంలో ఉగ్రచర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆన్లైన్ రాడికలైజేషన్ ట్రెండ్ కన్నా ఇది ప్రమాదకరమైనది అని ఆయన వ్యాఖ్యానించారు. -
మాల్యాకు అసలు భారత్ వచ్చే ఉద్దేశం లేదు
-
మాల్యాకు అసలు భారత్ వచ్చే ఉద్దేశం లేదు
న్యూఢిల్లీ: మద్యంవ్యాపారి, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతి విజయ్ మాల్యాపై ఢిల్లీ పటియాలా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు అప్పులు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఫెరా ఉల్లంఘన కేసులో సమన్లను తిరస్కరించడంపై , నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. అసలు మాల్యాకు దేశానికి తిరిగి ఇచ్చే ఉద్దేశమే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే తనకు భారత్ రావాలని ఉన్నా పాస్ పోర్టు రద్దయిందంటూ కపటనాటకం ఆడుతున్నాడని, ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నాడని కోర్టు పేర్కొంది. ఇప్పటికే పలుసార్లు ఆదేశాలు జారీ చేశామని, మాల్యాకు భారతీయ చట్టాలపై గౌరవం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది . కాగా 17 బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలను బాకీ పడి బ్రిటన్ కు పారిపోయిన మాల్యా ఆస్తులను ఈడీ కేసులు నమోదు చేసింది. ఇటీవల సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల ఆస్తులను ఎటాచ్ చేసింది. 2012లో చెక్‌బౌన్స్ కేసులో మాల్యాకు మరో ఎన్బీడబ్యూ జారీ చేసింది. తాజాగా ఆగస్ట్ 23న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, మాల్యాపై మరో కేసు నమోదు చేసింది. -
జపాన్ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణం
టోక్యో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. జపాన్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు బృందం గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటుంది. అనంతరం పలువురు కేంద్రమంత్రులు, జడ్జీలను కలిసి పుష్కరాలకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. దీనిలో భాగంగా బాబు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ల అపాయింట్మెంట్లు కోరారు. లభించిన పక్షంలో వారితో సమావేశమై రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. లేనిపక్షంలో ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తారు. -
లెక్కలేవి సార్...!
సార్వత్రిక సమరం ముగిసింది. ఫలితాలూ వచ్చి గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. వారిలో అమాత్యులయ్యేందుకూ యత్నిస్తున్నారు. ఇలా అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతా ఓకే..అని మురిసిపోతున్నా..వారు అసలు గుట్టు విప్పడం లేదు. ఎన్నికల వేళ వ్యయపరిచిన మొత్తాలకు లెక్కలేవి సార్..అంటే మొహం చాటేస్తున్నారు. కొందరు మమ అనిపించినా అధికులు చూద్దామంటూ దాటవేత వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీన్ని తేల్చేందుకే ఇప్పుడు వ్యయ పరిశీలకులు జిల్లాకు వస్తున్నారు.ఖర్చుల కథ తేల్చనున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికలు ముగిసి నెలన్నర కావస్తున్నా పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపడం లేదు. లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు అరకొర వివరా లు సమర్పించారు. అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా రిటర్నింగ్ అధికారులకు వివరాలు ఇవ్వలేదు. దీంతో అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని తేల్చేం దుకు ఎన్నికల కమిషన్ నియమించిన వ్యయ పరిశీలకులు జిల్లాలో మూడు రోజుల పాటు వివరాలు సేకరించనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు 15 మంది, 14 అసెంబ్లీ స్థా నాలకు 123 అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల సందర్భంగా నిబంధనల మేరకు రోజూవారి ఎన్నికల వ్య యాన్ని అభ్యర్థులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసి ఫలితం తేలినా అభ్యర్థులు మాత్రం ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి రూ.70లక్షలు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా రూ.28 లక్షల వరకు వ్యయం చేసే వీలుంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన తొమ్మిది మందిలో బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి మినహా మిగతా అభ్యర్థులు వ్యయ వివరాలు సమర్పించారు. లెక్కలు సమర్పించిన వారు పూర్తి వివరాలు ఇంకా అందజేయాల్సి వుంది. నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరుగురు పోటీ చేయగా ఒక్కరూ నేటికీ పూర్తి వివరాలు సమర్పించిన దాఖలా లేదు. మహబూబ్న గర్ లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఏపీ జితేందర్‌రెడ్డి రూ.43.16లక్షలు ఖర్చు చూపారు. కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్‌రెడ్డి రూ.33.50లక్షలు, స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ రూ.47వేలు, ఇబ్రహీం రూ.7.99లక్షలు, వైఎస్సార్సీపీ అభ్యర్థి రహమాన్ 2.31 లక్షలు ప్రచార వ్యయం చేసినట్లు లెక్కలు చూపారు. అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు లెక్కలు సమర్పించినందున తమ వద్ద వివరాలు లేవంటూ కలెక్టరేట్ అధికారులు చెప్తున్నారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు, డిపాజిట్ దక్కించుకున్న అభ్యర్థులు తమ డిపాజిట్ సొమ్ము వాపస్ చేయాల్సిందిగా లేఖ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికల లెక్కలు సమర్పిస్తేనే డిపాజిట్ తిరిగి ఇస్తామనే షరతు అధికారులు విధిస్తున్నారు. నేడు జిల్లాకు వ్యయ పరిశీలకులు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ వివరాలు సరిచూసేందుకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. నలుగురు ఐఆర్ఎస్ అధికారులు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు అభ్యర్థుల వారీగా వ్యయ వివరాలు సేకరించనున్నారు. వీరికి సహకరించేందుకు జిల్లా యంత్రాంగం స్థానిక అధికారులను సంధానకర్తలుగా నియమించింది. ఐఆర్ఎస్ అధికారి శంకర్ మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానంతో పాటు మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థుల వ్యయ వివరాలు పరిశీలిస్తారు. మరో ఐఆర్ఎస్ అధికారి బి.ప్రధాన్ కొడంగల్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల అభ్యర్థులు వ్యయ వివరాలు సేకరిస్తారు. పి.మోహన్ గోపు నాగర్‌కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు అభ్యర్థుల నుంచి, భట్టాచార్జి సుమిత్ర వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, ఆలంపూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలిస్తారు. సకాలంలో ఎన్నికల వ్యయాన్ని సమర్పించిన అభ్యర్థులకు ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారులు లేఖలు రాశారు. ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించని అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలుంటాయని అధికారులు వెల్లడించారు. -
నేడే మున్సి‘పోల్స్’
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఆదివారం నిర్వహించే నగరపాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. 50 డివిజన్లకు జరగనున్న ఈ ఎన్నికలకు 209 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. 1130 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. ఇందులో 230 మంది రిటర్నింగ్, 230 మంది అసిస్టెంట్ రిటర్నింగ్, 670 మంది ఇతర ఎన్నికల సిబ్బందిని నియమించారు. 26 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి 10 పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్లు, 16 పోలింగ్ స్టేషన్లలో వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశారు. 50 డివిజన్లకు 17 రూట్లు ఏర్పాటు చేశారు. ప్రతి రూట్‌కు ఒక జోనల్ ఆఫీసర్, ఒక రూట్ ఆఫీసర్‌ను కేటాయించారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నాతాధికారులకు తెలియపరిచేందుకు జోనల్ అధికారులకే విధులు అప్పగించారు. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం 50 డివిజన్లకు వివిధ పార్టీలకు చెందిన 376 మంది పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న పోలింగ్‌తో వారి భవిత ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. కార్పొరేషన్ పరిధిలో 2,28,872 ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,18,886 మంది మహిళలు 1,09,970, ఇతరులు 16 మంది ఉన్నారు. యువతను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఆ దిశగానే కొనసాగించారు. మహిళల ఓట్లతో పాటు గ్రూపు మహిళల ఓట్లు కీలకం కావడంతో గ్రూపులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ శాయశక్తుగా ప్రలోభాలకు గురిచేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా పాదయాత్రలను, ప్రచారాన్ని నిర్వహించారు. అభ్యర్థులు, నాయకులు హామీలు, వాగ్దానాలు, చేయబోయే అభివృద్ది కార్యక్రమాలను వారి ప్రచారంలో ఊదరగొట్టినప్పటికీ.. ఓటర్లు తమ మనస్సాక్షితో నేడు వేసే ఓటుతోనే వారి భవతవ్యం తేటతెల్లం కానుంది.