ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు.
టోక్యో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. జపాన్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు బృందం గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటుంది. అనంతరం పలువురు కేంద్రమంత్రులు, జడ్జీలను కలిసి పుష్కరాలకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.
దీనిలో భాగంగా బాబు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ల అపాయింట్‌మెంట్లు కోరారు. లభించిన పక్షంలో వారితో సమావేశమై రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. లేనిపక్షంలో ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తారు.