మాల్యాకు అసలు భారత్ వచ్చే ఉద్దేశం లేదు | Vijay Mallya has no intention of returning to India: Delhi court | Sakshi
Sakshi News home page

Nov 4 2016 5:06 PM | Updated on Mar 22 2024 11:21 AM

మద్యంవ్యాపారి, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతి విజయ్ మాల్యాపై ఢిల్లీ పటియాలా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు అప్పులు ఎగవేసి విదేశాల‌కు పారిపోయిన వ్యాపార‌వేత్త విజ‌య్‌మాల్యా ఫెరా ఉల్లంఘన కేసులో సమన్లను ​తిరస్కరించడంపై , నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. అసలు మాల్యాకు దేశానికి తిరిగి ఇచ్చే ఉద్దేశమే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే తనకు భారత్ రావాలని ఉన్నా పాస్ పోర్టు రద్దయిందంటూ కపటనాటకం ఆడుతున్నాడని, ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నాడని కోర్టు పేర్కొంది. ఇప్పటికే ప‌లుసార్లు ఆదేశాలు జారీ చేశామ‌ని, మాల్యాకు భార‌తీయ చ‌ట్టాల‌పై గౌర‌వం లేద‌ంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది .

Advertisement
 
Advertisement
Advertisement