సాక్షి, అమరావతి: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు నేపథ్యంలో ఏపీలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఏపీలోని పలు చోట్ల ఎన్‌ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. విజయనగరంలోని టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, విశాఖలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారుల సోదాలు జరుపుతున్నారు. అలాగే, గుంటూరులోని పొన్నూరులో, కర్నూలులోని పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానంగా ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


