అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు

New Twist In Tirumala Fire Accident Case - Sakshi

తిరుపతి: తిరుమల అగ్ని ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందున్న ఆస్థాన మండపంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 దుకాణాలు కాలిపోవడం, ఓ వ్యక్తి సజీవ దహనమవడం కలకలం రేపింది. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టిన పోలీసులకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి. మృతుడు మల్లిరెడ్డి తన సెల్‌ఫోను, పర్స్‌ మరో దుకాణంలో ఉంచాడు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మృతుడి భార్య శోభ సహాయంతో లాక్‌ తీసి సెల్‌ ఫోన్‌ను పరిశీలించారు. 

మంగళవారం వేకువజామున 5 గంటల సమయంలో మల్లిరెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్టు గుర్తించారు. కీలకంగా మారిన ఆ వీడియోలోని విషయం ఏమన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మరింది. మరోవైపు ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మల్లిరెడ్డి ఎలా చనిపోయాడు? అతని ద్వారానే అగ్నిప్రమాదం జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ విచారణ లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అగ్ని ప్రమాదానికి అరగంట ముందు మలిరెడ్డి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు లభించాయి. ఆస్థానమండపంలో జరిగిన అగ్నిప్రమాదం పై ఓ క్లారిటీ వచ్చింది. మల్లిరెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు.

ఇక్కడ చదవండి: తిరుమలలో భారీ అగ్నిప్రమాదం : ఫొటోగ్రాఫర్‌ సజీవ దహనం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top