పోలీసుస్టేషన్‌కు సూది పంచాయితీ! | needle prick claim creates drama at bus stand | Sakshi
Sakshi News home page

పోలీసుస్టేషన్‌కు సూది పంచాయితీ!

Jun 9 2026 12:06 PM | Updated on Jun 9 2026 12:14 PM

needle prick claim creates drama at bus stand

శ్రీసత్యసాయి జిల్లా: వెనుక నుంచి సూది గుచ్చిందంటూ ఓ మహిళ మరో మహిళతో గొడవకు దిగింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరింది. వివరాలు.. కదిరి పట్టణానికి చెందిన పక్కీరమ్మ సోమవారం ఆరోగ్యం బాగాలేకపోవడంతో బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చింది. 

వెనక వైపు నుంచి సూదితో గుచ్చినట్లు అనిపించగా.. వెనకే ఉన్న మహిళ గుచ్చిందంటూ ఆమెతో వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాబ్జాన్‌ వెంటనే అక్కడకు చేరుకుని ఇద్దరినీ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం పక్కీరమ్మను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆమె శరీరంపై ఎటువంటి  ఇంజెక్షన్‌ ఆనవాళ్లు లేవని తేలడం గమనార్హ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement