రివాల్వర్‌తో కాల్చుకుని నేవీ ఉద్యోగి ఆత్మహత్య | Navy employee commits suicide by shooting himself with revolver | Sakshi
Sakshi News home page

రివాల్వర్‌తో కాల్చుకుని నేవీ ఉద్యోగి ఆత్మహత్య

Jun 20 2026 4:16 PM | Updated on Jun 20 2026 5:12 PM

Navy employee commits suicide by shooting himself with revolver

సాక్షి, వైజాగ్‌: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఒక నేవీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు( శనివారం) యథావిధిగా ఈ రోజులు విధులకు హాజరైన మోర్ పరాగ్ సురేష్‌ ఒక్కసారిగా తన వద్ద ఉన్న పిస్తోల్‌తో కాల్చుకున్నాడు. దీంతో పెద్దఎత్తున శబ్ధం రావడంతో సహచర సిబ్బంది వెంటనే అప్రమత్తమయి పరుగెత్తగా సురేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిసింది.

దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఎయిర్‌ పోర్టు పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. నేవీ ఉద్యోగి సురేష్‌ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అశోకా పార్క్‌లోని నేవీ క్యాంటిన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement