‘రైతుల కోసం చంద్రబాబు ఆందోళన చేయడం హాస్యాస్పదం’

MVS Nagi Reddy Fires On Chandrababu Over Farmers Issue - Sakshi

సాక్షి, తాడేపల్లి: రైతుల కోసం చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రైతులకు చేసిందేమి లేదన్నారు. గిట్టుబలు ధరలు లభించక రైతులు అప్పుల పాలయ్యారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 2004కి ముందు రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.

చదవండి: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

ఆత్మహత్యలు చేసిన వారికి పరిహారం ఇవ్వాలంటే అలాఇస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకుంటారన్న వ్యక్తి చంద్రబాబని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేదని, ఎన్నికలొస్తే ఆయనకు మళ్లీ రైతులు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఎక్కడన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు రైతు కోసం అని పిలుపునిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాబు హయాంలో ఏటా అనేక కరువు మండలాలను ప్రకటించారని, ఈ రెండున్నరేళ్లలో ఒక్క కరువు మండలం లేదని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top