కేంద్రమంత్రికి ఎంపీ గురుమూర్తి లేఖ | MP Gurumoorthy writes to MSME Minister | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రికి ఎంపీ గురుమూర్తి లేఖ

Jul 1 2026 7:20 PM | Updated on Jul 1 2026 7:45 PM

 MP Gurumoorthy writes to MSME Minister

సాక్షి, తిరుపతి:  కేంద్ర MSME మంత్రి జీతన్ రామ్ మాఝీకి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఈ రోజు (బుధవారం) లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ  ఎంటర్‌ప్రెన్యూర్లకు ఇన్స్ంటివ్స్‌ విడుదలపై  ఏపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. స్టార్టప్‌లు ఏర్పాటు చేసిన వ్యాపార వేత్తలకు ఇన్సెంటివ్‌ల  విడుదల ఆగిపోయిందని తెలిపారు.

రూ. 2,000 కోట్లు MSME-SC/ST స్కీమ్ పేరిట రుణాలు..కాగా  అందులో రూ. 500 కోట్లు గ్లోబల్ సమ్మిట్‌కు, రూ. 469 కోట్లు ఫుడ్ ప్రాసెసింగ్‌కు మళ్లించారు 2,850 యూనిట్లకు 20% లేదా 40% మాత్రమే ఇన్‌సెంటివ్స్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ కేటగిరీ మెగా యూనిట్లకు  మాత్రం 100% పూర్తి చెల్లింపు చేశారు. 8,500 యూనిట్లకు ₹650 కోట్లు బకాయిలు విడుదల చేయాలన్నారు.

బ్యాంకు రుణాలు, ప్రైవేట్ రుణాలు తీసుకొని పరిశ్రమలు నెలకొల్పిన SC/ST యువత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని కేంద్రప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని SC/ST ఇన్స్ంటివ్స్‌ పూర్తిగా విడుదల చేయాలని కోరారు.  SC/ST పథకాల నిధులు మళ్లింపుపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, APIICపై కేంద్రం చర్యలు తీసుకోని కేంద్రం ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్లను రక్షించాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement