ఆధునాత‌న పారిశుధ్య యంత్రాల ప్రారంభం | Modern Sanitation Machines Inaugurated Minister Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

ఆధునాత‌న పారిశుధ్య యంత్రాల ప్రారంభం

Sep 3 2020 1:18 PM | Updated on Sep 3 2020 1:27 PM

Modern Sanitation Machines Inaugurated Minister Botsa Satyanarayana - Sakshi

సాక్షి, విజయవాడ :  అధునాతన పారిశుధ్య యంత్రాలను  మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా విఎంసీ త‌రుపున కొత్త టెక్నాలజీతో  ఏడు  కొత్త వాహనాలను కొనుగోలు చేశామ‌ని ప్ర‌స‌న్న వెంక‌టేష్ తెలిపారు. వీటి ద్వారా కాలువ‌ల పూడిక‌ల‌ను సులువుగా తీయోచ్చ‌ని పేర్కొన్నారు.  జెసిబీలో మూడు మినీ‌ వాహనాలు, కొత్తగా మూడు నాళామేన్ వాహనాలను కొనుగోలు చేసిన‌ట్లు చెప్పారు.  మూడు క్లీనింగ్ యంత్రాలను సైతం  అందుబాటులోకి తెస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ కొత్త యంత్రాల వ‌ల్ల ప‌ని వేగ‌వంత‌మ‌వుతుంద‌ని, స‌మ‌యం కూడా ఆదా అవుతుంద‌న్నారు. (మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి కన్నుమూత)

Advertisement
 
Advertisement
Advertisement