AP: మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా జకియా ఖానమ్‌ నామినేషన్‌ | MLC Zakia Khanam Files Nomination For AP Council Deputy Chairman Election | Sakshi
Sakshi News home page

AP: మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా జకియా ఖానమ్‌ నామినేషన్‌

Nov 25 2021 6:42 PM | Updated on Nov 25 2021 8:49 PM

MLC Zakia Khanam Files Nomination For AP Council Deputy Chairman Election - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు అయింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి మైనారిటీ మహిళకు డిప్యూటీ చైర్మన్ పదవి అవకాశం దక్కనుంది. శుక్రవారం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది.

చదవండి: అల్పపీడనం: భారీ వర్షాలు! సోషల్ మీడియా వార్తలు నమ్మొద్దు

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జకీయా ఖానమ్‌కు మండలి వైఎస్ చైర్మన్ పదవి ఇవ్వడం హర్షదాయకమని అన్నారు. ఒక మైనారిటీ మహిళను ఎంపిక చేయడం కీలక నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలపై  సీఎం జగన్‌కు ఉన్న ప్రేమ స్పష్టమైందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement