‘ఉగాది రోజు కూడా చంద్రబాబు అబద్ధాలు’ | Former Minister RK Roja Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఉగాది రోజు కూడా చంద్రబాబు అబద్ధాలు’

Mar 20 2026 3:01 PM | Updated on Mar 20 2026 5:58 PM

Former Minister RK Roja Slams Chandrababu Naidu

తిరుపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ నాడు కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. 

‘జగనన్న పాలనలో ప్రతి పేదవాడు,ఉద్యోగి, రైతు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు నుంచి  సూపర్ సిక్స్ అని ,మ్యానిఫెస్టోలో పెట్టారు. సూపర్‌ సిక్స్‌తో సూపర్‌ మోసం చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇస్తామని,మోసం చేశారు. రైతులుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారా..? ఏవిధంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎవరు సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 

సిగ్గులేని  బీఆర్‌ నాయుడు.. చైర్మన పదవి నాకు ఏమైనా అన్నం పెడుతుందా అంటాడు.. హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయి అంటాడు.. అర్హత లేని వాళ్లకు గౌరవం ఇస్తే ఇలానే ఉంటుంది.. రాజీనామా చెయ్..  బీఆర్‌ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి తరమి కొట్టాలి’ అని ఆర్‌కే రోజా విమర్శించారు. 

YSRCP బూత్ కమిటీ సమావేశం.. నేతలకు RK రోజా సూచన

Advertisement
 
Advertisement
Advertisement