ప్రతి ఇంటిలో అన్నగా మహిళల అభివృద్ధికి.. | MLA Roja Ties Rakhi To MP Mithun Reddy In Tirupati | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటిలో అన్నగా మహిళల అభివృద్ధికి..

Aug 3 2020 12:22 PM | Updated on Aug 3 2020 12:28 PM

MLA Roja Ties Rakhi To MP Mithun Reddy In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరి ఎమ్మెల్యే రోజా ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఇంటిలో అన్నగా ఉంటూ మహిళల ఆభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని కేవలం అమరావతిలో భూములు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement