
సాక్షి, విజయవాడ : కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదస్తులో తెలియజేసేలా రోజుకో వీడియో బయటకు వస్తోంది. మంత్రి నారాయణ తన నోటికి పని చెప్పారు. అమరావతి రాజధాని పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అమరావతి పనులను మంత్రి నారాయణ తాజాగా పర్యవేక్షించారు. ఆ సమయంలో పనులు సరిగ్గా జరగడం లేదంటూ కాంట్రాక్టు సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సివిల్ ఇంజనీర్లు చెప్పే వాస్తవ పరిస్థితి వివరిస్తున్నా వినకుండా తన ఫ్రస్టేషన్ ప్రదర్శించారు. హే నోరు మూయ్.. గెట్ అవుట్.. యూజ్‌లెస్ ఫెలో అంటూ అందరి ముందు ఇంజనీరింగ్ అధికారులపై చిందులు తొక్కారు.
కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. జేసీ ప్రభాకరరెడ్డి, గాలి భానుప్రకాశ్, బొలిశెట్టి శ్రీనివాస్, ఇలా ఇప్పుడు ఈ లిస్టులో నారాయణ కూడా వచ్చి చేరారు.
