పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం

Massive Karnataka votes in Raptadu constituency - Sakshi

 రాప్తాడు నియోజకవర్గంలో భారీగా కర్ణాటక ఓట్లు

ఎన్నికల సమయంలోనే వచ్చే ఓటర్లు.. ఐదేళ్లు అదృశ్యం

‘పరిటాల’ కనుసన్నల్లో దశాబ్దాలుగా నకిలీ ఓట్ల దందా

దొంగ ఓట్లు, రిగ్గింగ్‌తోనే అరకొర మెజార్టీతో విజయం

గెలుస్తామనే నమ్మకం కోల్పోయిన పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్‌

అందుకే దొంగ ఓట్ల తొలగింపుపై అనవసర రాద్ధాంతం

  • శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయ­తీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరు­గురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్‌ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడా­నికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. 
  • కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్‌ (48), బి.రమేశ్‌కుమార్‌ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు.

   ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. 

సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది.

స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు.

ప్రస్తుతం  ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటా­ల శ్రీరామ్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు.

ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక..
నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు.  నేడు వైఎస్సా ర్‌సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top