సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో రూ.వందల కోట్ల దోపిడీ | Loot of hundreds of crores from the CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో రూ.వందల కోట్ల దోపిడీ

Sep 28 2026 3:51 AM | Updated on Sep 28 2026 3:51 AM

Loot of hundreds of crores from the CM Relief Fund

22 నెలల్లోనే ఏకంగా రూ.1,298 కోట్లు డ్రా 

వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్‌ అశోక్‌కుమార్‌ ఫైర్‌ 

సాక్షి, అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు ప్ర­భు­త్వం దారుణంగా వెన్నుపోటు పొడుస్తూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) పేరుతో అంతులేని దోపిడీకి తెరలేపిందని ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ అశోక్‌కుమార్‌ ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లా­డుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలల్లోనే ఏకంగా రూ.1,298 కోట్లను సీఎంఆర్‌ఎఫ్‌ కింద డ్రా చేసి.. ఇందులో రూ.వెయ్యి కోట్లు ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకే కేటాయించడం భారీ కుంభకోణానికి నిదర్శనమని చెప్పారు. 

ఒకవైపు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన రూ.3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని.. మరోవైపు, అధికార కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ­లు, వారి అనుయాయులకు చెందిన ఆసుపత్రుల­కు సీఎం రిలీఫ్‌ ఫండ్, ఆరోగ్యశ్రీ నిధులను అడ్డగోలు­గా దోచిపెడుతున్నారని అశోక్‌కుమార్‌ తెలి­పా­రు. పేషెంట్లు లేకపోయినా దొంగ ఎల్వోసీలు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్ల­గొడు­తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పట్టించుకోకపోవడం ఆయన అవినీతి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. 

చంద్రబాబు ప్రభు­త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు కనీసం మందు­లు కూడా దొరకని దుస్థితి నెలకొందని.. అద్దంకి ని­యో­జకవర్గంలోని ప్రభుత్వాస్పత్రిని చూస్తే 50 పడకలు కూడా సరిగ్గాలేవని, అది ఒక భూత్‌ బంగ్లాలా మారిందని అశోక్‌కుమార్‌ చెప్పారు. ప్రభు­త్వం కనీస మౌలిక వసతులు కల్పించడంలేదన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement