జగనన్నే మా సీఎం.. మేము సైతం సిద్ధం | Sakshi
Sakshi News home page

జగనన్నే మా సీఎం.. మేము సైతం సిద్ధం

Published Mon, Apr 15 2024 11:12 AM

Leaders and activists support CM Jagan - Sakshi

బిడ్డ ఎలా ఉన్నాడోనని ఓ తల్లి.. కొడుకు ఏం చేస్తున్నాడోనని ఓ తండ్రి.. అన్నకేమైందోనని ఓ చెల్లి, తమ్ముడు.. ఇలా జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా ఆదరించే ప్రతి ఒక్కరూ తమ నేతను చూడాలని మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్నారు‌. మండు టెండను సైతం లెక్క చేయకుండా వెల్లువెత్తున్నారు.. వారిలో ఎవరిని కదిపినా..ఎందుకొచ్చారని అడిగినా.. వారు పొందిన సంక్షేమం జగన్ పై అభిమానం ఉప్పొంగుతోంది.. చంద్రబాబుపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు.. బాధతో కన్నీరులొకుతున్నారు.. కుట్రలపై కోపోద్రిక్తులవుతున్నారు.‌. ఇలాంటి దృశ్యాలెన్నో
 

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరం భారీగా చేరుకుంటున్న జనం, వైఎస్సార్ సిపి శ్రేణులు

జననేత, సంక్షేమ సారథిపై జరిగిన దాడితో యావత్‌ రాష్ట్రం రగిలిపోతోంది. పచ్చ కుట్రలను చేధిస్తూ.. మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. బస్సు యాత్రలో అప్యాయ పలకరింపులతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడికెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఈ క్రమంలో..   


చిన్న వట్టిపల్లి నుండి గన్నవరం తరలి వెళ్తున్న యువత


సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిని చూడాలనిపెదవాడపల్లి నుండి వెళుతున్న దివ్యాంగుడు వేల్పుల బాలరాజు

ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మాలాంటి వాళ్లు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాము. చాలామందికి పించను ఇస్తున్నారు. నాకైతే ఇళ్ల స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కట్టించారు. మా పిల్లలకి చదువుకునేందుకు డబ్బులు ఇస్తున్నారు. లాప్టాప్ కూడా ఇచ్చారు. మా ఊళ్లో చాలామందికి అమ్మ ఒడి డబ్బులు పడుతున్నాయి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఒక్కటీ రాలేదు. టిడిపి అధికారంలోకి వస్తే పేదల బతుకులు బుగ్గి పాలవుతాయి. మళ్లీ జగనే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

జుజ్జవరపు విజయకుమార్, తెన్నేరు, పెనమలూరు మండలం

నాపేరు ఎం. ప్రసాద్. మాది ఉంగుటూరు మండలం గన్నవరం నియోజకవర్గం పొనుకుమాడు. నాకు పింఛను.. మా ఆవిడకి కాపునేస్తం... నాకు రైతు భరోసా ఇస్తున్నారు..మా కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంది. చంద్రబాబు కుట్రలను ప్రజలు తెలుసుకుంటున్నారు.  పెన్షన్లు అందకుండా పేదల ఉసురు పోసుకున్నారు. పేదల ఇబ్బందులకు చంద్రబాబే కారణం. ఆయన మనుషులే కేసులు వేసారు. దానివల్లే పెన్షన్ ఇంటికి ఇవ్వకుండా ఆపారు. ఈ సారి తగిన బుద్ధి చెపేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు మంచి చేస్తున్న జగన్ కే మా మద్దతు. మా నాయకుడు మా మంచి కోసం మా ఊరు వస్తున్నాడు. ఆయన్ని చూడటం ఎంతో సంతోషం

ఎం. ప్రసాద్, పొనుకుమాడు

సీఎం జగన్ ప్రభుత్వంలో నాకు సొంతింటి కల నెరవేరింది. మా పాపకు అమ్మ ఒడి వస్తుంది. మా అమ్మకు వద్దప్ప పింఛన్ వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు పన్నిన సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలేరు. మా అభిమాన నాయకుడు జగన్ను కనులారా చూసేందుకు మండుటెండ సైతం లెక్కచేయకుండా వేచి చూస్తున్నాం. చంద్రబాబు పుట్టిన రాజకీయం వల్ల వృద్ధులు పింఛన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎలాంటి వారు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. నాతో పాటు మా కుటుంబ సభ్యులందరి ఓట్లు కూడా జగన్ గారికి. జగన్ను రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తీరుతాం.

మాధవి ఆత్కూరు, ఉంగుటూరు మండలం.
 

Advertisement
 
Advertisement