కేసులతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? | Kesineni Nani Reacts to Case | Sakshi
Sakshi News home page

కేసులతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?

Jun 14 2026 11:09 AM | Updated on Jun 14 2026 6:18 PM

Kesineni Nani Reacts to Case

సాక్షి,విజయవాడ: ఉర్సా భూముల వ్యవహారంలో కేశినేని సోదరుల మధ్య మాటలు మంటలు కొనసాగుతున్నాయి. 14 నెలల క్రితం వైజాగ్‌ ఉర్సా భూముల కుంభకోణంపై కేశినేని చిన్ని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నాటి ఫిర్యాదుపై ఇప్పుడు కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పోలీసులు కేశినేని నానిపై కేసు నమోదు చేశారు. ఆ కేసుపై కేశినేని నాని సోసల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. 

ఫ్రస్టేషన్‌తోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు గుప్పించారు. దొంగ కంపెనీకి వేల కోట్ల విలువైన భూముల్ని కట్టబెడుతున్నారు. ప్రశ్నించినందుకు నాపై 14 నెలల తర్వాత కేసు పెట్టారు. తాను లేఖ రాసినందుకే దొంగ కంపెనీకి భూములు కేటాయించలేదని అన్నారు. డీల్‌ అడ్డం తిరగడంతో కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తిలేదని కేశినేని నాని స్పష్టం చేశారు.  

ఉర్సా భూముల కుంభకోణం
వైజాగ్‌లో డేటా సెంటర్‌ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని కేశినేని నాని గతేడాది ఏప్రిల్‌ నెలలో సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అందులో 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కేశినేని చిన్ని, తన స్నేహితులు, బినామీలతో కలిసి కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను ఏర్పాటు చేశారు.  

ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్‌ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్‌మేట్స్‌ అని ‘ట్వంటీఫస్ట్‌ సెంచురీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రాపర్టీ స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరే. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని చంద్రబాబుకు కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement