హైదరాబాద్: మద్యం అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు.
అధికారులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా అరెస్టులో కొత్తేముంది? అక్రమ అరెస్టులు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. నా కుమారుడిని అరెస్ట్ చేశారు.. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. ఏమీ లేకుండానే కుటుంబాన్నంతటినీ ఇబ్బంది పెడుతున్నారు. కల్పితాలేవో వాస్తవాలేంటో కోర్టులో తెలుస్తాయి’’ అని ఆయన అన్నారు.
కాగా, హైదరాబాద్‌లోని తన నివాసంలో కారుమూరిని ఈడీ ఆదివారం అరెస్టు చేసింది. తప్పుడు కేసులో కారుమూరిని కూటమి ప్రభుత్వం ఇరికించిన క్రమంలో ఆయనను అరెస్టు చేసింది. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించారని మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: కారుమూరి అక్రమ అరెస్టును ఖండించిన బీసీ నేతలు


