నేడు సీజేగా జస్టిస్‌ గోస్వామి ప్రమాణం | Justice Goswami was sworn in as CJ om 6th Jan | Sakshi
Sakshi News home page

నేడు సీజేగా జస్టిస్‌ గోస్వామి ప్రమాణం

Jan 6 2021 4:02 AM | Updated on Jan 6 2021 9:11 AM

Justice Goswami was sworn in as CJ om 6th Jan - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బుధవారం ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు ఆయన చేత గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు జరుగుతుంది. తరువాత జస్టిస్‌ గోస్వామి హైకోర్టుకు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి కేసులను విచారిస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement