
జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాడిపత్రి రూరల్:‘భవిష్యత్తులో నేను వైఎస్సార్‌సీపీలోకి రావచ్చేమో! వైఎస్ కుటుంబం నాకు బాగా తెలుసు’ అని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరిపైనా కక్ష లేదన్నారు.
పట్టణంలో భవన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. దీనివల్ల కొందరు బాధ పడొచ్చని, అందుకు తనను క్షమించాలన్నారు. భవిష్యత్తులో పట్టణ ప్రజలు అన్ని అనుమతులు తీసుకుని భవనాలు నిరి్మంచుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.