డిప్యూటీ ఎంపీడీఓ ఆకస్మిక మృతి | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ ఎంపీడీఓ ఆకస్మిక మృతి

Mar 15 2026 1:18 AM | Updated on Mar 15 2026 1:18 AM

న్యూస్‌రీల్‌

గుమ్మఘట్ట: డిప్యూటీ ఎంపీడీఓ చంద్రశేఖర్‌ (48) ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన గుండెపోటుతో ప్రాణం విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరుకు చెందిన చంద్రశేఖర్‌ కొనకొండ్ల గ్రేడ్‌–1 పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ ఏడాది జనవరిలో డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొంది.. గుమ్మఘట్టకు బదిలీపై వచ్చారు. శుక్రవారం డ్యూటీకి సెలవు పెట్టిన ఆయన.. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ లాడ్జిలో బస చేశారు. శనివారం ఉదయం రూమ్‌బాయ్‌ వచ్చి తలుపు కొట్టగా లోపలి నుంచి ఉలుకుపలుకూ లేదు. లాడ్జి యజమానులకు తెలపగా.. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ మరణవార్త తెలియగానే కార్యాలయ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రేపు ‘పరిష్కార వేదిక’

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై అర్జీలను రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలన్నారు.

చంద్రశేఖర్‌ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement