యాడికి: మట్టి టిప్పర్ ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని చందన–రాయలచెరువు మార్గంలో జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు... యాడికి మండలంలోని రాయల చెరువు గ్రామ సమీపంలోని చెరువు నుంచి ఇటీవల విచ్చలవిడిగా టిప్పర్లలో మట్టి తరలిస్తున్నారు.శనివారం సాయంత్రం మట్టి తరలిస్తున్న టిప్పర్ చందన–రాయలచెరువు మార్గంలో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొంది. ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలానికి చెందిన వారని తెలిసింది. స్థానికులు వారిని అనంతపురం తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయంపై పోలీసులను వివ రణ కోరగా తమకు సమాచారం అందలేదని తెలిపారు.


