పుట్లూరు: మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ఓ బీఎస్‌ఎఫ్ మాజీ హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుట్లూరు మండ లంలోని ఎస్. కొండేపల్లికి చెందిన మాజీ బీఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బోనాల వెంకట శ్రీనివాసులు కొన్నిరోజులుగా అక్రమంగా మద్యం విక్రయాలు చేపడుతున్నాడు. విశ్వసనీయ సమాచారంతో శనివారం పోలీసులు అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. కింగ్‌ఫిషర్ బీర్ ప్రీమియం బాటిళ్లు 24, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ బాటిళ్లు 52, ఇతర మద్యం బాటిళ్లు 27 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేంద్ర బాబు తెలిపారు.


