రేయ్‌ నా కొడకల్లారా.. జాగ్రత్త! | YSRCP Leader JC Prabhakar Reddy Sparks Controversy After Failing To Meet Anantapur SP, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

రేయ్‌ నా కొడకల్లారా.. జాగ్రత్త!

Oct 24 2025 5:28 AM | Updated on Oct 24 2025 11:26 AM

JC Prabhakar Reddy gets on media

మీడియాపై రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి

ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు వచ్చిన జేసీ 

గంటసేపు వేచి ఉన్నా నో అపాయింట్‌మెంట్‌

ఆడలేక మద్దెలవోడు అన్నట్టు మీడియాపై రుసరుస

అనంతపురం సెంట్రల్‌: ‘రేయ్‌.. నా కొడల్లారా.. ఏమనుకుంటున్నారు. మీ ఇళ్ల వద్దకు వస్తా. ఏమనుకుంటున్నారో. ఒక్కో నా కొడుకు ఇష్టారాజ్యంగా రాస్తారా. నాకు గన్‌మెన్లు తొలగిస్తున్నారని సోషల్‌ మీడియాలో పెడతారా.. ఒక్కో  యూట్యూబ్‌ నా కొడుక్కి చెబుతున్నా జాగ్రత్త’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి బూతులతో రెచ్చిపోయారు. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీ రోహిత్‌ చౌదరిని దుర్భాషలాడటంతోపాటు ఏఎస్పీగా పనికిరాడంటూ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానిం చడం, దీనికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఎస్పీ జగదీష్‌ అదే రీతిలో స్పందించడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగా వేచి ఉన్నా.. ఎస్పీ జగదీష్‌ ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వెనుతిరిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై జేసీ బూతులు లంకించుకున్నారు. అంతుచూస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. 

నేను చదువుకున్న వాన్ని.. మా తాతల కాలం నుంచి రాజకీయం చేస్తున్నాం అంటూ మాట్లాడే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్న మాటలు చూసి జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అధికారపార్టీలో ఉన్నా.. చివరుకు జిల్లా ఎస్పీ కూడా కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటే జేసీకి ఉన్న విలువ ఏపాటిదో అన్నది అర్థం కావడం లేదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement