జనసేన నాయకుల ఓవరాక్షన్‌.. దెబ్బకు జారుకున్నారు | Janasena Leaders Over Action at Pedana Jagananna Colony | Sakshi
Sakshi News home page

జనసేన నాయకుల ఓవరాక్షన్‌.. దెబ్బకు జారుకున్నారు

Nov 12 2022 2:36 PM | Updated on Nov 12 2022 2:52 PM

Janasena Leaders Over Action at Pedana Jagananna Colony - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవరాక్షన్‌ చేశారు. జగనన్న లే ఔట్‌ను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని చెప్పాలంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు దిగిన జనసేన నాయకులపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత ఇల్లు లేని తమకు జగనన్న కాలనీలో ఇళ్లు ఇచ్చారని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక జనసేన నాయకులు తోకముడిచి అక్కడినుంచి జారుకున్నారు. 

చదవండి: (సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి: సీఎం జగన్‌)

Advertisement
 
Advertisement
Advertisement