హోంగార్డుల వేతన వెతలు తీరేనా..! | The issue of a salary hike for home guards has come to the fore once again | Sakshi
Sakshi News home page

హోంగార్డుల వేతన వెతలు తీరేనా..!

Oct 15 2026 2:36 AM | Updated on Oct 15 2026 2:36 AM

The issue of a salary hike for home guards has come to the fore once again

 వేతనాల పెంపుపై ప్రభుత్వానికి మూడు నెలల గడువిచ్చిన హైకోర్టు

వేతనాలను రూ.18 వేల నుంచి రూ.21,300కు పెంచిన వైఎస్‌ జగన్‌ 

చంద్రబాబు వచ్చాక వేతనాలు పెంచకపోవడంతో కోర్టును ఆశ్రయించిన హోంగార్డులు 

రాష్ట్రంలో 16 వేలకు పైగా హోంగార్డులు వేతనాల పెంపు కోసం ఎదురుచూపులు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల వేతనాల పెంపు అంశం మరోసారి తెరపైకొచ్చింది. వేతనాల పెంపు కోసం హోంగార్డులు హైకోర్టునాశ్రయించడంతో.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని గత నెల 30న ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేతనాల పెంపుపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి మూడు నెలలు గడువు విధిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో రాష్ట్రంలో పోలీస్‌ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 16 వేల మందికి పైగా హోంగార్డులకు వేతనాల పెంపుపై ఆశలు చిగురించాయి.   

కానిస్టేబుళ్లతో సమాన వేతనం కోసం డిమాండ్‌.. 
కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు వేతనం ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం పోలీస్‌ కానిస్టేబుల్‌కు బేసిక్‌ రూ.25,220కు డీఏ కలుపుకొని నెలకు రూ.35,560గా ఉంది. హోంగార్డులకు ఇప్పుడు ఇస్తున్న రూ.21,300 వేతనాన్ని కానిస్టేబుళ్ల మాదిరి రూ.35,560కు పెంచాలని కోరుతున్నారు. హోంగార్డుల వేతనాల పెంపుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా వారు డిమాండ్‌ చేస్తున్నారు. హోంగార్డు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధి రక్షక్‌ వర్సెస్‌ హిమాచలప్రదేశ్‌ కేసులో నెలలో 30 రోజుల డ్యూటీ అలవెన్స్‌ మొత్తం.. రాష్ట్ర పోలీస్‌ సిబ్బందికి వర్తించే కనీస వేతనానికి సమానంగా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఒడిశా హోంగార్డులకు సంబంధించి కేసు­లోనూ సుప్రీం కోర్టు ఈ సూత్రాన్ని సమర్థించింది.   

వేతనాలను పెంచాలి   
రాష్ట్రంలో హోంగార్డులకు వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ స్టేట్‌ హోంగార్డ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.గోవిందు, కె.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు. గతంలోను సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హోంగార్డులకు పోలీస్‌ కానిస్టేబుళ్లతో సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement