
ప్రభుత్వ ఉద్యోగుల వినూత్న కార్యక్రమం
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం కడప ఇరిగేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగుల సమస్యలను ఒక వీడియో రూపంలో ఉద్యోగుల ముందుకు తీసుకు రావడం జరుగుతోంది. ఏపీజీఈఏ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఉద్యోగుల హక్కులపై అందరినీ చైతన్యపరిచి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేలా కృషి చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు కృష్ణప్రసాద్, సుదర్శన్‌రెడ్డి, బీవీ చంద్రశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.