
యెకోసుకా తీరంలో భారత యుద్ధనౌక
సాక్షి, విశాఖపట్నం: జపాన్‌లో ఈ నెల 6న ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత యుద్ధనౌకలు బుధవారం యెకోసుకా తీరానికి చేరుకున్నాయి. తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ కమోర్తా యుద్ధ నౌకలు ఐఎఫ్‌ఆర్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఈ ఐఎఫ్‌ఆర్‌లో 13 దేశాలకు చెందిన 40 యుద్ధనౌకలు, జలాంతర్గాములు పాల్గొంటున్నాయి. ఫ్లీట్ రివ్యూని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమీక్షించనున్నారు. ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న అనంతరం.. భారత యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ కమోర్తా జపాన్‌లో జరిగే మలబార్ 26వ ఎడిషన్ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. నవంబర్ 8 నుంచి 18 వరకు జరిగే మలబార్‌లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల నౌకాదళాలు పాల్గొంటాయి.