పెరిగిన ఎండల తీవ్రత | Increased Sun intensity In AP | Sakshi
Sakshi News home page

పెరిగిన ఎండల తీవ్రత

Sep 7 2020 5:32 AM | Updated on Sep 7 2020 5:32 AM

Increased Sun intensity In AP - Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం కూడా కొనసాగింది. రుతుపవనాలు బలహీనపడడంతో ఎండలు మండుతున్నాయి. అక్కడక్కడా వర్షాలు పడినా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. అమరావతిలో 36, విజయవాడలో 35.5, కడపలో 35.9, గుంటూరులో 36, రాజమహేంద్రవరంలో 36.2, ఏలూరులో 34.6, విజయనగరంలో 34, చిత్తూరులో 33.9, విశాఖపట్నంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

నేడు, రేపు పలుచోట్ల వర్షాలు
► ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. 
► దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. 
► రానున్న 48 గంటల్లో ఉత్తర దిశ వైపు ప్రయాణిస్తూ అల్పపీడనం బలహీనపడుతుంది. 
► దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement