పెదకాకానిలో టెన్షన్‌.. టెన్షన్‌ | High Tension In Pedakakani Guntur District | Sakshi
Sakshi News home page

పెదకాకానిలో టెన్షన్‌.. టెన్షన్‌

Sep 4 2026 10:35 AM | Updated on Sep 4 2026 11:16 AM

High Tension In Pedakakani Guntur District

సాక్షి, గుంటూరు: పెదకాకానిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అమ్మవారి మంగళసూత్రం మాయంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పెదకాకాని శ్రీభ్రమరాంబ అమ్మవారికి నాంతాడు కానుకగా సమర్పించేందుకు పొన్నూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ అంబటి మురళీకృష్ణ సిద్ధమయ్యారు. అంబటి మురళీకృష్ణను అడ్డుకోవాలని టీడీపీ నాయకులు ప్లాన్‌ చేశారు. పెదకాకాని ఆలయానికి టీడీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. అంబటి మురళి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోన రఘుపతిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు

మల్లాది విష్ణు కారుపై దాడికి చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారి మంగళసూత్రం మాయం నేపథ్యంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి ఇవాళ నాంతాడు సమర్పిస్తానని వారం రోజులు క్రితమే అంబటి మురళి ప్రకటించారు. అంబటి మురళితో పాటు కొంతమంది భక్తులు కొత్త నాంతాడు తయారు చేయించారు. అయితే, వైఎస్సార్‌సీపీ నేతలను ఆలయం వైపు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement