breaking news
Ambati Murali
-
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, గుంటూరు: పెదకాకానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమ్మవారి మంగళసూత్రం మాయంపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పెదకాకాని శ్రీభ్రమరాంబ అమ్మవారికి నాంతాడు కానుకగా సమర్పించేందుకు పొన్నూరు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ సిద్ధమయ్యారు. అంబటి మురళీకృష్ణను అడ్డుకోవాలని టీడీపీ నాయకులు ప్లాన్ చేశారు. పెదకాకాని ఆలయానికి టీడీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. అంబటి మురళి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోన రఘుపతిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారుమల్లాది విష్ణు కారుపై దాడికి చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారి మంగళసూత్రం మాయం నేపథ్యంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి ఇవాళ నాంతాడు సమర్పిస్తానని వారం రోజులు క్రితమే అంబటి మురళి ప్రకటించారు. అంబటి మురళితో పాటు కొంతమంది భక్తులు కొత్త నాంతాడు తయారు చేయించారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలను ఆలయం వైపు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. -
అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి
-
దొంగ ఎవరో తెలిసి కూడా.. పూజారుల్ని బలిచేస్తున్నారా?
సాక్షి, గుంటూరు: పొన్నూరు ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దొంగల్ని పట్టుకోకుండా.. పూజారులను సస్పెండ్ చేశారంటూ మండిపడుతున్నారు. పైగా కొత్త మంగళసూత్రం సమర్పించే విషయంలోనూ స్పష్టత లేకుండా పోయింది. ఈ క్రమంలో.. గురువారం అమ్మవారికి తానే కొత్త మంగళసూత్రం సమర్పించారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి అంబటి మురళి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు. కానీ, తప్పడం లేదు. 14వ తేదీన అమ్మవారి మంగళసూత్రం పోయింది. మంగళసూత్రం లేకుండానే వరలక్ష్మి వ్రతం చేయించారు. ఇది అశుభం. మంగళసూత్రాన్ని ఎలా సమకూరుస్తారో ప్రభుత్వం ప్రకటించలేదు. దేవదాయ శాఖ, రెవెన్యూ యంత్రాంగం ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రభుత్వం స్పందించడం లేదు. అమ్మవారి మెడలో పూలదండలు తీసే సమయంలో మంగళసూత్రం పోయిందని కబుర్లు చెబుతున్నారు. మంగళసూత్రాన్ని చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి వేయాలని ఆలయ అధికారి బసవ శంకర్ చూశాడు. అలాంటప్పుడు ఈవో, సీనియర్ అసిస్టెంట్ లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. అమాయకులైన పూజారులనే ఎందుకు సస్పెండ్ చేశారు?.. దొంగ ఎవరో తెలుసు... కావాలనే బయట పెట్టలేదు. ఇవాళ మంగళసూత్రాలు ఇచ్చాం. నాను తాడు సెప్టెంబర్ 3వ తేదిన అందిస్తాం అని అంబటి మురళి పేర్కొన్నారు. పరువు నష్టం నోటీసులపై స్పందనఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రాజ్యాంగేతర శక్తిగా మారాడు. నాపై పరువు నష్టం దావా వేశాడు. రూ. 5 కోట్లకు నోటీసులు పంపించారు. ఆయన రాజకీయ జీవితాన్ని సెకనుకు ఐదు పైసలుగా లెక్క కట్టాడు. ఆ ఐదు పైసలు నేనే ఇస్తాను. పాపాల భైరవుణ్ణి శిక్షించవా తల్లి అని అమ్మవారిని అంబటి మురళి వేడుకున్నారు. పూజారుల ఉసురు తగులుతుంది: ఆరే శ్యామలమంగళసూత్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. ‘‘అర్చకులను దొంగతనంలో భాగస్వాములను చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియదా?. పూజారుల ఉసురు తగులుతుంది. దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వపైనే ఉంది’’ అని అన్నారామె. -
మంగళసూత్రం మాయంపై కేసు లేదా? బాబు సర్కార్ పై అంబటి ఫైర్
-
దూళిపాళ్ల తిన్నదంతా కక్కిస్తాం
-
నీ బతుకేంది ధూళిపాళ్ల.. సంగం డైరీ లెక్కలు తెలుస్తా
-
అంబటి మురళీకి మళ్లీ నోటీసులు
గుంటూరు: పొన్నూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి అంబటి మురళీకి పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. మొక్కజొన్న రైతుల పరామర్శ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులిచ్చారు పోలీసులు. ఇదిలా ఉంచితే, రెండు రోజుల క్రితం మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ చేశారు. బుధవారం(మే 20వ తేదీ) ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి బుధవారం ఉదయం పొన్నరూ వైఎస్సార్సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది.


