సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. 33 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు( (వింటర్ సిటీ సర్వీసెస్) పూర్తిగా దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది.


