మహిళా న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా | High Court CJ Justice Lisa Gill assures Bar Council members | Sakshi
Sakshi News home page

మహిళా న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా

Aug 5 2026 5:10 AM | Updated on Aug 5 2026 5:10 AM

High Court CJ Justice Lisa Gill assures Bar Council members

బార్‌ కౌన్సిల్‌ సభ్యులకు హైకోర్టు సీజే జస్టిస్‌ లీసా గిల్‌ హామీ

సాక్షి, అమరావతి: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్‌ కౌన్సిల్‌)కి కొత్తగా ఎన్నికైన సభ్యులు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశా­రు. ఈ సందర్భంగా వారు కింది కోర్టుల్లో న్యా­య­వాదులు, ముఖ్యంగా మహిళా న్యాయవాదు­లు ఎదుర్కొంటున్న సమస్యలను సీజే దృష్టికి తీసుకొచ్చారు. కింది కోర్టుల్లో మరు­గుదొడ్లు, వెయి­టింగ్‌ రూమ్‌లు లేక మహిళా న్యాయవాదు­లు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని వి­వ­రించారు. దీనిపై స్పందించిన సీజే.. ఈ విష­యంలో ఇప్పటికే తగిన చర్యలు చేపట్టినట్లు తెలి­పారు. ఎక్కడెక్కడ మరుగుదొడ్లు, వెయిటింగ్‌ రూంల అవసరం ఉందో వివరాలు తెప్పించుకు­­నే పనిలో ఉన్నానన్నారు. 

న్యాయవాదులు మరణించినప్పుడు ఏర్పాటు చేసే సంస్మరణ సభల­ను సాయంత్రం 4.15 గంటలకు మా­ర్చడంపై కింది కోర్టుల న్యాయవాదుల అభ్య­ం­­తరాలను బార్‌ కౌన్సిల్‌ నూతన సభ్యులు సీజే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న విధంగా ఉదయమే సంస్మరణ సభలు ఏ­ర్పా­­టు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కో­రా­రు. దీనిపై కూడా సీజే సానుకూలంగా స్పందించారు. కోర్టు పని మొ­ద­లు కావడానికి ముందే సంస్మరణ సభ ఏర్పాటు చేసుకునే అవకాశా­న్ని పరిశీలించాలని బార్‌ కౌన్సిల్‌ సభ్యులకు సూచించారు. 

సీజేను కలిసిన వారిలో అజయ్‌ కు­మార్‌ చలసాని, కలిగినీడి చిదంబరం, ఆలూ­రు రామిరెడ్డి, గొర్రెముచ్చు శాంత కుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, యలమంజుల బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి శ్రీనివాస రాజు, ఎస్‌.రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసులరెడ్డి, ఎన్‌వీ సుమంత్, రవి బెల్లన, బండారు వెంకట రమణ మూర్తి, గంటా రామారావు, కీర్తి రామ జో­గేశ్వరరావు, కె. వెంకట్రామిరెడ్డి, మాధవి,కృష్ణమోషన్,అంక­య్య, శ్రీదేవి, మంజులత, దుర్గా నాగశ్రీ, రాగి గంగా భవాని ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement