తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. వారికి మరో అవకాశం

Heavy Rain: TTD Announces Good New For Devotees - Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షల కారణంగా తిరుమల స్వామివారి దర్శనానికి రాలేని భక్తులకు ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పించింది. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు టికెట్లు కలిగిన భక్తులు.. దర్శన టికెట్టు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన తేదీని మార్చుకోవడంతో పాటు.. నూతన టికెట్లను పొందే అవకాశం కల్పించింది.

ఆరునెలలలోపు ఎప్పుడైనా పాత దర్శనం టికెట్లతో.. నూతన టికెట్టు పొందవచ్చని తెలిపింది.  ప్రస్తుతం వర్షబీభత్సం తగ్గిందని, తిరుమలకు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని టీటీడీ స్పష్టం చేసింది. రెండు ఘాట్‌ రోడ్లలో వాహనాలను అనుమతిస్తున్నామని టీటీడీ తెలిపింది.

ఘాట్‌ రోడ్డు ప్రాంతాల్లో.. పాడైన నిర్మాణపనులు జరుగుతున్నాయని టీటీడీ పేర్కొంది. శ్రీవారి మెట్ల మార్గం నాలుగు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, అలిపిరి నడక మార్గంలో ఎలాంటి నిర్మాణాలు దెబ్బతినలేదని టీటీడీ అడిషనల్‌ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top