రాష్ట్ర వాణిజ్యం.. తిరోగమనం! | GST collections fall by 10 percent in November: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వాణిజ్యం.. తిరోగమనం!

Dec 2 2024 5:12 AM | Updated on Dec 2 2024 5:12 AM

GST collections fall by 10 percent in November: Andhra pradesh

నవంబర్‌లో 10 శాతం పడిపోయిన జీఎస్టీ వసూళ్లు 

గతేడాది రూ.4,093 కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.3,699 కోట్లకు పరిమితం 

దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 9.38% వృద్ధి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు తిరోగమన దిశలో సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడంతో జీఎస్టీ వసూళ్లు క్షీణించాయి. గడచిన మూడు నెలల్లో నాలుగు, ఏడు శాతం చొప్పన జీఎస్టీ వసూళ్లు తగ్గగా, నవంబర్‌లో ఏకంగా 10 శాతం మేర క్షీణించాయి. నవంబర్‌లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 10 శాతం క్షీణించి రూ.4,093 కోట్ల నుంచి రూ.3,699 కోట్లకు పడిపోయినట్లు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. ఇదే సమయంలో తమిళనాడు 8 శాతం, కర్ణాటక 15 శాతం, కేరళ 10 శాతం, తెలంగాణ 3 శాతం వృద్ధి నమోదు చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే క్షీణతను నమోదు చేసింది. నవంబర్‌లో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 9.38 శాతం వృద్ధితో రూ.139,678 కోట్లుగా నమోదైంది.

దేశ సగటు కంటే వెనుకబాటు 
వైఎస్సార్‌సీపీ హయాంలో దేశ స­గటు కంటే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మాత్రం వెనుకబడ్డాయి. ఈ ఆరి్థక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు చూస్తే  దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధితో రూ.11,04,817 కోట్లు వసూళ్లు అయితే ఏపీలో కేవలం 2.2శాతం వృద్ధితో రూ.30,056 కోట్ల­కు పరిమితమైంది. కూటమి ప్రభు­త్వం అధికా­రం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకా­లు అటకెక్కడంతో ప్రజ­ల్లో కొనుగో­లు శక్తి పడిపోవడంతోపాటు అధికా­రం చేపట్టి 5 నెలలు గడచినా  అభివృద్ధి కార్య­క్ర­మాలు చేపట్టకపోవడం జీఎస్టీ వసూ­­ళ్లు తగ్గిపోవడానికి కారణ­మని అధికారులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement