సీలేరులో మరో వెలుగు | Green signal for pumped storage project in Sileru | Sakshi
Sakshi News home page

సీలేరులో మరో వెలుగు

Jan 27 2025 5:44 AM | Updated on Jan 27 2025 5:44 AM

Green signal for pumped storage project in Sileru

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

నెలలో పనులు ప్రారంభం

సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒడిశా సరిహద్దు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక్కొక్క నీటి బిందువు ప్రవాహంలా మారి ప్రవహిస్తూ పేరు గాంచిన సీలేరు నది రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది.ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ప్రవహించే నీటితో తక్కువ ఖర్చుతో రూ.కోట్లలో ఆదాయం ఇచ్చేలా మరో జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం కానుంది. 

ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లో ఉన్న జలవిద్యుత్‌ కేంద్రాలతో పాటు నూతనంగా పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఎత్తిపోతల పథకం) నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. మరో నెలరోజుల్లో పనులూ ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు.

ప్రాజెక్టు నిర్మాణం ఇలా
తూర్పుకనుమల్లో మాచ్‌ఖండ్‌ మొదలుకొని బలిమెల నుంచి సీలేరు, డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్‌ కేంద్రాల్లోఉత్పత్తి అయిన నీరు శబరి నదిలో కలిసి గోదావరి మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఈ నీటిని వృధా కాకుండా పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు ద్వారా మరింత విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చనే లక్ష్యంతో ఏపీ జెన్‌కో రూ.13 వేల కోట్లతో సీలేరు సమీప పార్వతీనగర్‌ వద్ద తొమ్మిది యూనిట్లు ( 1350 మెగావాట్లు) విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది. 

ఈ ప్రాజెక్టు నిర్మాణం పైభాగంలో 3 కిలోమీటర్ల పొడవునా. సొరంగం తవ్వి గుంటవాడ డ్యామ్‌ నుంచి నీటిని తీసుకువచ్చి విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు.అనంతరం విడుదలైన నీరు మరో 3 కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా  డొంకరాయి జళాశయంలోకి మళ్లిస్తారు. 

అవసరమైనప్పుడు ఆదే నీటిని రివర్స్‌ పంపింగ్‌ విధానంతో ఆదే సొరంగం ద్వారా గుంటవాడ డ్యాంలోకి మళ్లించి మూడు సొరంగాల ద్వారా తొమ్మిది పైపులైన్లతో ఏర్పాటు చేయనున్నారు. అవసరమైనప్పుడు ఈ నీటిని విద్యుత్‌ ఉత్పత్తి చేసే వి«ధంగా యాప్‌కో సంస్థ ద్వారా మూడేళ్లు సుదీర్ఘంగా పరిశీలన చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement