గొర్ర గేదె మృతి 

Gorra Gede Died In Polavaram - Sakshi

పోలవరం రూరల్‌: మండలంలోని ఎల్‌ఎన్‌డీపేట గ్రామ సమీపంలోని డేరా కొండ అటవీ ప్రాంతంలో గొర్రగేదె మృతిచెందింది. రెండు రోజుల క్రితం జీడిమామిడి పిక్కలు ఏరుకునేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తుల పై దాడి చేసిన ఘటన విధితమే. ఈ దాడిలో కట్టవ రామాయమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, పంది కొవ్వాడయ్య, పంది గంగాభవానీలకు గాయాలయ్యాయి.

వీరు చికిత్స పొందుతున్నారు. అటవీప్రాంతంలో పొదల నుంచి దుర్వాసన రావడంతో పశువుల కాపరులు గుర్తించి గొర్ర గేదె చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సమాచారాన్ని అధికారులకు స్థానిక వీఆర్వో సమాచారం ఇచ్చారు. దాడి జరిగిన రోజునే గొర్ర గేదె మృతిచెంది ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఐతే గొర్ర గేదె చనిపోవడానికి గల కారణాలు తెలియరాలేద.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top