గోపాలకృష్ణ, గిరిజాశంకర్‌ల బదిలీ! | Gopalakrishna And Girijashankar transfer | Sakshi
Sakshi News home page

గోపాలకృష్ణ, గిరిజాశంకర్‌ల బదిలీ!

Jan 26 2021 5:32 AM | Updated on Jan 26 2021 5:51 AM

Gopalakrishna And Girijashankar transfer - Sakshi

గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌

సాక్షి, అమరావతి:  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సూచన మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, తిరుపతి పట్టణ ఎస్పీని బదిలీ చేయడంతో పాటు కొత్తవారి నియామకం నిమిత్తం మూడేసి పేర్లతో ప్యానల్‌ పంపాల్సిందిగా ఎస్‌ఈసీ కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, వీరిలో ఎస్‌ఈసీ సూచించిన వారిని ఆ విధుల్లో నియమించాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.    

Advertisement
 
Advertisement
Advertisement