సాక్షి, మంచిర్యాల: కొత్తపల్లి రాజారాం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో గిరిజనుడు చింతల లస్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి దీంతో లస్మయ్య స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతనిని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో చెన్నూరు ఎఫ్డిఓ కార్యాలయం వద్దకు గిరిజన సంఘాల నేతలు పెద్దఎత్తున చేరుకున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు ఎఫ్డిఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులను పోలీసులు అడ్డుకున్నారు.


