గన్నవరంలో పొగమంచు ఎఫెక్ట్‌.. విమానాల రాకపోకలు ఆలస్యం | Foggy Weather Effect Fights Delay At Gannavaram Airport, More Details Inside | Sakshi
Sakshi News home page

గన్నవరంలో పొగమంచు ఎఫెక్ట్‌.. విమానాల రాకపోకలు ఆలస్యం

Jan 2 2025 9:14 AM | Updated on Jan 2 2025 11:05 AM

Foggy Weather Effect Fights Delay At gannavaram airport

సాక్షి, కృష్ణా: విమానాశ్రయాలపై పొగ మంచు ప్రభావం చూపిస్తోంది. తాజాగా గన్నవరం విమానాశ్రయం రన్‌ వేపై దట్టంగా పొగ మంచు అలుముకుంది. దీంతో, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

చలి కాలం కారణంగా పొగ మంచు ప్రభావం ఎక్కువైంది. పలుచోట్ల దట్టమైన పొగ మంచు కారణంగా విమానాలు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో రన్ వేపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో, విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా ఢిల్లీ నుండి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. మరోవైపు.. ఉదయం 9 గంటలైనా రోడ్లపై దట్టమైన పొగ మంచు ఉండటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement