జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచారం గ్రామాల్లో జోరుగా సాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆదివారం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. వైఎస్సార్ సీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపిస్తే నిత్యం ప్రజల్లో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు హామీ ఇచ్చారు. అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
– సాక్షి నెట్‌వర్క్


