విద్యాసంస్థల్లో భద్రత పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల్లో భద్రత పెంచాలి

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

విద్యాసంస్థల్లో భద్రత పెంచాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్‌ కౌన్సెలింగ్‌ సైకాలజిస్టుల అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో ఆదివారం సమావేశమైన కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు ఆ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోం మంత్రికి పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ టి.ఎస్‌.రావు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో వాచ్‌మెన్లను నియమించాలని, అపరిచిత వ్యక్తులు ప్రాంగణంలోకి రాకుండా లోపలికి వచ్చే వారిని ప్రశ్నించే వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గర్రే శంకరరావు మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక దృఢత్వానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులను నియమించి విద్యార్థులను చైతన్యవంతం చేయాలన్నారు. కోచ్‌ల ద్వారా విద్యార్థులకు ‘సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌’ (స్వయం రక్షణ) శిక్షణ ఇవ్వాలని, ప్రమాదం ఎదురైనప్పుడు ముందుగా తమను తాము ఎలా కాపాడుకోవాలో నేర్పించాలన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ మహిళా అధ్యక్షురాలు శ్రావణి కృష్ణవేణి, జగదీష్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

సైకాలజిస్టుల అసోసియేషన్‌ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement