రిగ్గింగ్‌కు తెలంగాణ నుంచి గూండాలు | - | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌కు తెలంగాణ నుంచి గూండాలు

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

రిగ్గింగ్‌కు తెలంగాణ నుంచి గూండాలు ● పోలీసుల అనుమతితోనే దొంగ ఓట్లు! ● యథేచ్ఛగా సాగిన కూటమి అరాచకం ● ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు

● పోలీసుల అనుమతితోనే దొంగ ఓట్లు! ● యథేచ్ఛగా సాగిన కూటమి అరాచకం ● ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు

లబ్బీపేట/పటమట(విజయవాడతూర్పు): ప్రజాధరణ కోల్పోయిన కూటమి ప్రభుత్వం విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. దొంగ ఓట్లు, రిగ్గింగ్‌తో విజయం సాధించేందుకు గూండాలను రంగంలోకి దింపింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గూండాలు ఆదివారం లబ్బీపేట శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వద్ద హడావుడి చేశారు. కూటమికి ఓట్లు వేయాలని ఓటర్లును బెదిరించడంతో పాటు, పోలింగ్‌ బూత్‌ల వద్దకు వెళ్లి దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు యత్నించారు. అయితే వారి ఆగడాలను స్థానికులు అడ్డుకున్నారు. స్థానికేతరులు వచ్చి రుబాబు చేయడం ఏమిటని నిలదీశారు. దీంతో తెలంగాణ గూండాలు అక్కడి నుంచి జారుకున్నారు.

ఉదయం నుంచే రుబాబు..

తెలంగాణ నుంచి వచ్చిన గూండాలు 11వ డివిజన్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద ఉదయం నుంచి ఓటర్లు, స్థానికులపై రుబాబు చేయడం ప్రారంభించారు. వారు కూటమికి అనుకూలంగా వ్యవహరించడంతో పోలీసులు సైతం చూసీ చూడనట్లు వదిలేశారు. సాయంత్రం వరకూ వారు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్‌ ముగిశాక ఒక్కొక్క బూత్‌లో ఓటర్లను క్లియర్‌ చేసి, తలుపులు వేసే సమయంలో తెలంగాణ గూండాలు నలుగురు బూత్‌లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఓటు వేసేందుకు వేసి ఉన్న వారు ప్రశ్నించడంతో వారిని తోసి వేసి తలుపులకు అడ్డుగా నిల్చున్నారు. వారు తెలంగాణ నుంచి రింగ్గింగ్‌ కోసం వచ్చినట్లు తెలుసుకున్న స్థానికులు నిలదీశారు. దీంతో వివాదం చెలరేగంతో పోలీసులు చేరుకుని నచ్చచెప్పారు. అనంతరం తెలంగాణ నుంచి వచ్చిన వారు అక్కడి నుంచి జారుకున్నారు. ప్రజలు అడ్డుకోకుంటే రిగ్గింగ్‌ చేసి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసేవారని స్థానికులు పేర్కొన్నారు.

దొంగ ఓట్లకు పోలీసుల సహకారం!

పటమట కేబీసీ ఉన్నత పాఠశాల్లో 17వ డివిజన్‌ నాలుగో బూత్‌కు ఓ యువతి రెండుసార్లు ఓటు వేయటానికి వచ్చింది. ఆమెను గమనించిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పర్వతనేని పవన్‌, బూత్‌ ఏజెంట్లు అడ్డుకున్నారు. రెండు గంటల క్రితమే ఓటు వేసి మళ్లీ ఎందుకు వచ్చావని ప్రశ్నించటంతో ఆ యువతి అక్కడి నుంచి ఉడాయించింది. అయితే పోలీసులు ఓటర్లతో దురుసుగా ప్రవర్తించారు. ఈ పోలింగ్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చిన కానిస్టేబుల్‌ వి.వెంకటరమణ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. క్యూలైన్లో ఉన్న వారిని చెదరగొట్టడం, విజిల్‌వేసి విసిగించటం, ఓటరు స్లిప్పు ఉన్నప్పటికీ వారిని బూత్‌ వరకు అనుమతించకపోవటంపై ఓటర్లు అభ్యంతరం తెలిపారు. దొంగ ఓటు వేయటానికి వచ్చిన యువతిని సదరు కానిస్టేబులే బూత్‌లోకి తీసుకెళ్లారని, ఆ విషయం వివాదం కావటంతో ఆయనే ఆమెను బయటకు తీసుకువెళ్లిపోయారని ఓటర్లు ఆరోపించారు. సదరు కానిస్టేబుల్‌ నేమ్‌ ప్లేట్‌పై పీసీ నంబరు లేకపోవటంతో అనుమానం వ్యక్తం చేయటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగా అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి కలగజేసుకుని ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement